మొదటి నోరో వైరస్ 1968లో USAలోని ఒహియో రాష్ట్రం, నార్వాక్ అనే పాఠశాలలో వ్యాప్తి చెందింది. అందుకే ఈ వైరస్‌ను నార్వాక్ వైరస్ అని పిలుస్తారు. నోరోవైరస్ గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణం. ఈ వైరస్‌కి 48 రకాలుగా 10 సమూహాలు ఉన్నాయి. ఇది చాలా సాధారణమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 685 మిలియన్ కేసులు నమోదవుతున్నాయి అని ఆరోగ్య శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.