జడ్జీల విషయంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తులు కూడా తమ ఆస్తులను బహిర్గతం చేయాలని స్పష్టంచేసింది. ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం చర్యలు చేపట్టింది.