కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన ఏఎం గ్రీన్ కంపెనీ పేర్కొంది. గ్రీన్కో సంస్థకు చెందిన ఈ అనుబంధ కంపెనీ ద్వారా 10 లక్షల టన్నుల సామర్థ్యంతో కూడిన గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్ కర్మాగారాన్ని 2023లో ఏఎం గ్రీన్ సంస్థ కోనుగోలు చేసింది. ఇప్పుడు దీనినే సాంకేతికంగా అభివృద్ధి చేసి గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయనుంది.