లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అదానీకి ఇచ్చిన విమానాశ్రయ, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం ప్రకటించారు. విద్యుత్ లైన్ల నిర్మాణానికి పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా సర్కారు $736 మిలియన్ల( దాదాపు రూ.62 వేల కోట్లు)కు అదానీ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది.