హీరో నాతో ఇబ్బందికరంగా మాట్లాడాడు: ఖుష్బూ

58చూసినవారు
సినీ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో నిర్వహించిన ఇఫ్ఫీ వేడుకల్లో  ‘సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ’ అనే అంశంపై చర్చాగోష్టిలో ఆమె మాట్లాడారు. ‘‘గతంలో ఓ సినిమా సెట్‌లో ఒక హీరో నాతో ఇబ్బందికరంగా మాట్లాడాడు. నాకు ఏదైనా ఛాన్స్‌ ఉందా? అన్నాడు. వెంటనే నేను నా చెప్పుల సైజు 41. ఇక్కడే చెంప పగలకొట్టనా? లేదా సెట్‌లో అందరి ముందు పగలకొట్టనా? అని అడిగా?. సమానత్వం, గౌరవంలో ఎక్కడా రాజీ పడకూడదనేది నా సిద్ధాంతం’’ అని ఆమె చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్