విజయవాడలోని సింగ్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. లోకేశ్‌ను ముఖ్యమంత్రి అని సంబోధించగా.. ‘నేను మంత్రిని రా స్వామి, నా ఉద్యోగం తీయించేలా ఉన్నావే’ అంటూ ఆ విద్యార్థితో లోకేశ్ సరదా కామెంట్స్ చేయగా అందరూ నవ్వుకున్నారు.