ఏపీలో వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం హాట్ టాపిక్‌గా మారింది. జగన్‌కు షర్మిల రాసిన లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది ప్రతి ఇంట్లో జరిగే గొడవేనని.. వీటిని చంద్రబాబు పెద్దవి చేసి చూపిస్తున్నారని జగన్ అన్నారు. 'ప్రతి ఇంట్లో ఉండే గొడవే. కానీ తల్లి, చెల్లిని ఆస్తి విషయంలో ఎవరూ కోర్టుకు లాగారు' అంటూ జగన్ వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. దీంతో జగన్ కవరింగ్ కామెంట్లకు షర్మిళ బ్లాస్టింగ్ రిప్లై ఇచ్చారంటూ నెట్టింట కామెంట్లు వస్తున్నాయి.