స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తికి గాయాలు

73చూసినవారు
స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తికి గాయాలు
ఎర్రగుంట్ల మండలం కదిరేపల్లె క్రాస్ వద్ద మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంను జీవనజ్యోతి స్కూల్ వ్యాన్ ఢీకొని ద్విచక్ర వాహనదారునికి గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇచ్చి అరగంట అయినా రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు పేర్కొన్నారు. జీవనజ్యోతి యాజమాన్యంపై పట్టణవాసులు అసహనం వ్యక్తం చేశారు.