జమ్మలమడుగులో కొనసాగుతున్న ఉద్రిక్తత..
ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. వీళ్లిద్దరి మధ్య ప్లైయాష్ తరలింపునకు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోకి ఆర్టీపీపీ వస్తుంది. తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమలకు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయుల వాహనాలు ప్లైయాష్ తరలిస్తున్నాయి. దీనిపై ఒప్పందం కుదరకపోవడంతో జేసీ దివాకర్‌రెడ్డి వాహనాల్ని ఆర్టీపీపీకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదని ఆదినారాయణరెడ్డి వర్గీయులు పంతం పట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జేసీ దివాకర్‌రెడ్డి వాహనాలు ఆర్టీపీపీకి వస్తున్నాయని తెలిసి, ఆర్టీపీపీ సమీపంలోని కలమల్ల వద్ద ఆదినారాయణరెడ్డి వర్గీయులు భారీగా మోహరించారు.