అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసం దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా బన్నీ ఇంటి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు.