ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అదానీ అవినీతి అంశంపై వేడెక్కనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇందులో కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్రం నియమించిన జాయింట్ కమిటీ తమ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించనుంది. మరో ఐదు నూతన బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి.