శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

59చూసినవారు
శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం
క‌ళియుగ వైకుంఠం తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. స్వామి వారి ద‌ర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భ‌క్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న 66,256 మంది భక్తులు వెంక‌న్న ద‌ర్శ‌నం చేసుకున్నారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం రూ. 3.54 కోట్లుగా లెక్క తేలింద‌ని టీటీడీ వెల్ల‌డించింది.