ఢిల్లీలో నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా

62చూసినవారు
ఢిల్లీలో నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా
దేశ రాజధానిలో ఎండల తీవ్రత, పలుచోట్ల తాగునీటి కొరత వంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ తెలిపారు. నీటి పైపులతో కార్లను కడగడం, వాటర్‌ ట్యాంకర్లు ఓవర్‌ ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు.