ఎండిపోయిన 900 ఏళ్ల నాటి ఎర్ర కోనేరు

56చూసినవారు
ఎండిపోయిన 900 ఏళ్ల నాటి ఎర్ర కోనేరు
AP: వైఎస్సార్‌(D) గండికోటలోని ఎర్ర కోనేరు ఎండిపోయింది. 900 ఏళ్ల చరిత్ర గ‌ల ఈ కోనేరు అడుగంటిన ఆనవాళ్లు గతంలో లేవని స్థానికులు చెబుతున్నారు. పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాజుల కాలంలో యుద్ధాల తర్వాత ఖడ్గాలను సైనికులు ఈ కొలనులో క‌డ‌గ‌టం వల్ల నీళ్లు ఎర్రగా మారాయ‌ని.. అందుకే దీనికి ఎర్ర కోనేరు, క‌త్తుల కోనేరు అనే పేర్లు వచ్చాయ‌ని చ‌రిత్ర‌కారుల మాట‌.

సంబంధిత పోస్ట్