ఇండియన్​ నేవీలో 250 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తుకు మరో 6 రోజులే ఛాన్స్

50చూసినవారు
ఇండియన్​ నేవీలో 250 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తుకు మరో 6 రోజులే ఛాన్స్
కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2025 జూన్‌ నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతోంది. వివిధ విభాగాలలో మొత్తం 250 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 29 సెప్టెంబర్‌ 2024.

సంబంధిత పోస్ట్