యాలకులను పాలతో కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలల్లో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి, సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.