అమెరికాలో 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వచ్ఛంధంగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తే ఎనిమిది నెలల జీతం ముందుగానే ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. ఈ ఆఫర్‌కు లక్షకు పైగా ఉద్యోగులు స్పందిస్తారని భావించినా.. గురువారం నాటికి కేవలం 40 వేల మంది మాత్రమే రాజీనామా చేశారు.