ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో గతేడాది డిసెంబర్లో ఉపాధ్యాయుడి చేతిలో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక మంగళవారం వారణాసిలో మరణించింది. దుద్ది గ్రామానికి చెందిన 8వ తరగతి బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక ఆరోగ్యం క్షీణించడంతో వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించింది. కాగా, అత్యాచారం ఘటనపై ఆమె తండ్రి జులై 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.