గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం.. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభ్యం

84చూసినవారు
గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం.. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభ్యం
దాదాపు 200 ఏళ్ల క్రితం ఒక పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం తాజాగా బయటపడింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన వాలంటీర్లకు తాజాగా ఈ బాటిల్‌ దొరికింది. కాగా గాజు సీసాలో చుట్టి ఉంచిన లేఖలో నార్మాండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే ‘గౌలిష్’ అనే గ్రామానికి సంబంధించిన వివరాలు రాసి ఉన్నాయి. పీజే ఫెరెట్ అనే స్థానిక పురావస్తు శాస్త్రవేత్త జనవరి 1825లో ఇక్కడ తవ్వకాలు చేపట్టినట్టు ఈ 200 ఏళ్ల నాటి లేఖలో ఉంది.

సంబంధిత పోస్ట్