ప్రేమ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తట్టుకోలేక 21 ఏళ్ల యువతి 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

74చూసినవారు
ప్రేమ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తట్టుకోలేక 21 ఏళ్ల యువతి 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
ప్రేమ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తాళలేక 21 ఏళ్ల యువతి (తేజశ్విని) 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా దోమడుగులో జరిగింది. బి. ఫార్మసీ చదువుతున్న తేజస్వినీకి.. అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే వ్యక్తి ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. కొన్ని రోజుల పాటు చాటింగ్ చేసిన వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన తేజస్వినీ రాత్రి తన ఇంటిపై నుంచి దూకి మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్