ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నామికేషన్లకు ముందు ఈ పరిణామంతో ఆసక్తికరంగా మారింది.