AP: చదువుకు వయస్సుతో సంబంధం లేదని 69 ఏళ్ల బామ్మ నిరూపించారు. యడవిల్లి ఇందిర అనే బామ్మ వృద్ధాప్యంలో కూడా పరీక్ష రాసి బీవీకే కళాశాలలోని ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం నుంచి బీఏ పట్టా అందుకున్నారు. ఈమె తల్లిదండ్రులకు 11 మంది సంతానం. ఆ రోజుల్లో అంతమందిని చదివించలేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో 1970లో పదో తరగతి వరకు చదివారు. ఉన్నత చదువులు చదవాలనే కోరికను ఆమె ఈ వయస్సులో నెరవేర్చుకున్నారు.