రోడ్డు ప్రమాదంలో బిట్స్‌ పిలానీ ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బిట్స్‌ పిలానీ ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బిట్స్​పిలానీ ఇంజినీరింగ్ చదువుతున్న కరుణాకర్ రెడ్డి, శ్రీషిత్ తమ క్యాంపస్‌ నుంచి కీసరకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కరుణాకర్ రెడ్డి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్