సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాము షెడ్డులో మేత మేస్తున్న గెదేల వద్దకు వెళ్తుంది. తీరా దగ్గరికి వెళ్లాక గేదెను చూసి పగగ విప్పి బుసలుకొడుతుంది. పామును చూసిన గేదె ఏమాత్రం భయపకుండా సమీపానికి వస్తుంది. రావడమే కాకుండా బుస కొట్టిన పామును వాసన చూస్తూ.. నాలుకతో నాకుతూ తన ప్రేమను చూపిస్తుంది. ‘‘నువ్వు ఎంత విష సర్పానివైనా.. నేను మాత్రం నీకు హాని చేయను’’.. అన్నట్లుగా ఆ పాముపై ప్రేమ కనబరుస్తుంది.