భార్య, పిల్లల ముందే క్రికెటర్ దారుణ హత్య

58చూసినవారు
భార్య, పిల్లల ముందే క్రికెటర్ దారుణ హత్య
శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషనా (41) మంగళవారం రాత్రి హత్యకు గురయ్యారు. గాలే జిల్లా అంబలంగోడ పట్టణంలోని నివాసంలో భార్య, పిల్లల కళ్ల ముందే ఆయనను దుండగులు కాల్చి చంపారు. సంఘటన జరిగిన వెంటనే, పోలీసులు ధమ్మిక నిరోషనా నివాసానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. శ్రీలంక తరుపున ధమ్మిక U-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్