జపాన్ దేశంలో గురువారం భారీ
భూకంపం సంభవించింది. ఈ మేరకు జపాన్‌లోని కురిల్ దీవుల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టంగానీ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైనట్లు సమాచారం.