దసరాకి భర్త కొత్త చీర కొనలేదని వివాహిత ఆ‍త్మహత్య

52చూసినవారు
దసరాకి భర్త కొత్త చీర కొనలేదని వివాహిత ఆ‍త్మహత్య
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. భర్త చీర కొనివ్వలేదని 26 ఏళ్ల వివాహిత రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన మహిళను బాగ్జోపా నివాసి సెండో దేవిగా పోలీసులు గుర్తించారు. దసరా సందర్భంగా భర్త తనకు కొత్త చీర కొనివ్వలేదని, ఆగ్రహించి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ట్రాక్టర్ డ్రైవర్, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్