తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సంబురాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా గురువారం సాయంత్రం 3.00 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తుంది.