విమానం గాలిలో ఉండగా డోర్‌ తెరిచేందుకు వ్యక్తి యత్నం

67చూసినవారు
విమానం గాలిలో ఉండగా డోర్‌ తెరిచేందుకు వ్యక్తి యత్నం
కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్‌కు శనివారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయ్యింది. ఆ విమానంలో ఉన్న కేరళకు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ ముసావిర్ నడుకండీ ఒక్కసారిగా విమానం వెనుక భాగం వైపు వెళ్లి, అక్కడున్న క్యాబిన్‌ సిబ్బందిపై దాడి చేసి విమానం రోడ్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో పైలట్‌ ముంబై విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశాడు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుడ్ని అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్