కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గించే సరికొత్త పిల్‌ను అమెరికన్ బహుళజాతి ఔషధ సంస్థ 'ఎలీ లిల్లీ' ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసింది. 'మువలాప్లిన్' అనే ఈ పిల్‌ను అధిక మోతాదులో ఉపయోగించడం ద్వారా కొలెస్ట్రాల్ 70 నుంచి 86 శాతం మేరకు తగ్గినట్టు పరీక్షల్లో తేలిందని షికాగోలో జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సమావేశంలో పరిశోధకులు వెల్లడించారు. ఈ పిల్‌ను అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న 233 వయోజనులపై పరీక్షించారు.