హరియాణాకు చెందిన ఒకతను అధికారుల కళ్లుగప్పి బ్రెజిల్ విమానాశ్రయంలోనే మకాం పెట్టేశాడు. గౌరవ్ అనే వ్యక్తి
వీసా ఆన్ అరైవల్ సౌకర్యంపై ఢిల్లీ విమానాశ్రయం నుంచి బొలివీయా వెళ్లే క్రమంలో సావో పాలో (బ్రెజిల్) చేరుకున్నాడు. అయితే రిటర్న్ టికెట్ లేకపోవడంతో సిబ్బంది బొలివీయాకు అనుమతించలేదు. దీంతో వారం రోజులుగా విమానాశ్రయంలోనే ట్రాన్సిట్ ఏరియాలో తలదాచుకున్నాడు. చివరికి అతడ్ని అధికారులు గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.