ఢిల్లీలోని షాదాలో గురువారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీపావళి సంబరాల్లో ఉన్న ఓ కుటుంబంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 40 ఏళ్ల ఆకాశ్శర్మ, ఆయన మేనల్లుడు రిషభ్శర్మ చనిపోగా.. కుమారుడు క్రిష్శర్మ గాయపడ్డాడు. ఈ మేరకు వీరు ఇంటి ముందు టపాసులు కాలుస్తుండగా ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి ఆకాశ్ కాళ్లు మొక్కారు. అనుమానం వచ్చి ఆకాశ్ ఇంట్లోకి వెళ్తుండగా మరో దుండగుడు కాల్పులు జరిపాడు. భూ వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.