చింత ఆకు టీ తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చింత ఆకు టీ కోసం.. ముందుగా చింత ఆకులను నీటిలో వేసి మరిగించాలి. రుచి కోసం కొన్ని పుదీనా ఆకులను వేసుకోవాలి. ఇది బాగా ఉడకబెట్టిన తర్వాత ఫిల్టర్ చేయాలి. అనంతరం ఫిల్టర్ చేసిన టీ లో తేనె కలిపి తాగాలి. ఈ టీ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.