చెట్టంత మనిషి అని, చెట్టంత ఎదిగాడు అంటారు. ఈ విశ్వం అంతా పంచభూతాలతో నిండి ఉన్నది. చెట్లకు కూడా మనిషికిలాగే వినటం, వాసన, రుచి, స్పర్శ, దృష్టి అనే ఐదు ఇంద్రియాలూ ఉన్నాయి. అవి ఇతర జంతువుల్లాగా పైకి కనిపించకపోవచ్చు. మనిషిలో ఎలా పరిణామ క్రమం ఉంటుందో వాటిలోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తటం, పెరిగి పెద్దవ్వటం, పుష్పించి ఫలాలను ఇవ్వటం, కొంత కాలానికి వయస్సుడిగి నశించటం ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది.