రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చి కల్కి మూవీ నుంచి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వనీ దత్ మాట్లాడుతూ… వచ్చే ఏడాదిలో కల్కి –2 రిలీజ్ అవుతుందని అన్నారు. కమల్ హాసన్, ప్రభాస్ మధ్యే జరిగే సన్నివేశాలు ఎక్కువ ఉంటాయని, అమితాబ్‌కు తగిన ప్రాధ్యనత ఉంటుందని తెలిపారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ కల్కి 2898 ఏడీ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.