స్నేహితులకు వీడియో కాల్ చేసి పురుగుల మందు తాగిన యువకుడు(వీడియో)

50చూసినవారు
TG: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్ చేసి బైరి చందు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలే చందు ఆత్మహత్యాయత్నానికి కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్