తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

66చూసినవారు
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తిస్థాయిలో చెల్లించేవరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. 2 రోజుల క్రితం ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు రిలీజ్ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. కానీ అన్ని బిల్లులను క్లియర్ చేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్