అధికారులు తప్పు చేసినట్లు విచారణలో తేలితే తప్పకుండా చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. సంగారెడ్డి (D) అమీన్పూర్ మున్సిపాలిటీలో ఫిర్యాదుల పరిష్కారానికి పర్యటన చేసి మాట్లాడారు. అమీన్పూర్ పెద్ద చెరువుకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీనిపై ప్రత్యేకమైన టెక్నికల్ బృందంతో సర్వే చేయిస్తామని చెప్పారు. సర్వే ఆధారంగా ప్రభుత్వంతో మాట్లాడి 3 నెలల్లో ఫలితాలతో మళ్లీ వస్తామన్నారు.