అనిల్ కుల్దీప్ మెహతా ఆత్మహత్య చేసుకుని చనిపోయే కొద్ది క్షణాల ముందు అతను తన కుమార్తెలు నటి మలైకా అరోరా, అమృతా అరోరాలతో చివరిగా ఫోన్ చేసి మాట్లాడాడు. "నేను అనారోగ్యంతో ఉన్నాను. అలసిపోయాను" అని అతను వారికి చెప్పినట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. “మా తండ్రి మరణం మమ్మల్ని ఎంతో బాధిస్తోంది” అంటూ తన తండ్రి చనిపోయాక ఇన్‌స్టాగ్రామ్ లో మలైకా ఓ పోస్ట్ పెట్టారు.