సామాన్యులకు అపర సంజీవనిలా ‘ఆరోగ్యశ్రీ’ మారింది. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు కూడా వైఎస్ఆర్ ప్రారంభించిందే. 104 కాల్ సెంటర్ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు... ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేసి అభివృద్ధికి చిరునామాగా మారారు.