వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలి

65చూసినవారు
వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికై సమగ్ర చట్టం తీసుకు రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం శాఖ మహాసభలు నిర్వహించారు. వ్యవసాయ కార్మికుల కూలీ రేట్లను పెంచాలని, జాతీయ ఉపాధి హామీ పనుల 200 రోజులకు పెంచాలని కనీస కూలీ రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, తదితరులు ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్