భోరాజ్ మండల వ్యాప్తంగా సోమవారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలంలోని లేఖర్ వాడ, ఆకుర్ల గ్రామాలకు చెందిన ముస్లింలు స్థానిక ఈద్గా వద్ద నమాజులను ఆచరించారు. ఈ సందర్భంగా ఇమామ్‌లు మహమ్మద్ ప్రవక్త, ఖురాన్ బోధనలను వివరించారు. అనంతరం ఒకరికి ఒకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్ద పండగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు సైతం ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.