కన్యత్వ పరీక్షలపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. మహిళను కన్యత్వ పరీక్షకు బలవంతంగా పంపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందని తెలిపింది. ఆర్టికల్ 21 అనేది మహిళల జీవన, స్వేచ్ఛ, గౌరవ హక్కులను కాపాడుతుందని పేర్కొంది. కానీ కన్యత్వ పరీక్షలు ప్రాథమిక హక్కులు, మహిళా హక్కులను ఉల్లంఘిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. భార్యభర్తల మధ్య వివాదంపై కోర్టు ఈ తీర్పును వెలువరించింది.