AP: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేయడానికి కృషి చేయాలని వెంకటరమణకు సూచించారు. దేశంలో ప్రధాని మోదీ ఆశయాలు నచ్చి బీజేపీలో చేరినట్లు వెంకటరమణ తెలిపారు.