తాండూర్ మండలంలోని స్త్రీ నిధి సోషల్ ఆడిట్ ను మూడు నెలలు వాయిదా వేయాలని వివోఏలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అభ్యుదయ మండల సమాఖ్య ఏపిఎం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ నిధి రికవరీ విషయంపై మాకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. సోషల్ ఆడిట్ తో అవుట్ స్టాండింగ్ రికవరీ పూర్తిగా ఆగిపోయే సమస్యలు ఉన్నాయని తెలిపారు.