భీంపూర్ మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కటిన చర్యలు తప్పవని మండల నూతన ఎస్సై మహ్మద్ కలీం అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి చర్యలు తీసుకుంటామని, ప్రజలు సైతం తమకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.