విద్యార్థికి న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆందోళన

3199చూసినవారు
బోథ్ మండలంలోని సెయింట్ థామస్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ విద్యార్థికి రోడ్డు ప్రమాదం జరిగిందని ఇందుకు పాఠశాల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుమేర్ పాషా డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన విద్యార్థికి న్య్యాం చేయాలని, పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ. మంగళవారం ఎంఈఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రణీత్ అనే విద్యార్థి సెలవు అనంతరం ఇంటికి వెళ్ళే క్రమంలో అటుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో సదరు విద్యార్థికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. పాఠశాల జాతీయ రహదారికి దగ్గర్లోనే ఉండడంతో నిత్యం భారీ వాహనాలు తిరుగుతుంటాయి. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థుల రక్షణకై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థికి ప్రమాదం జరిగిందని తెలిపారు. వెంటనే పాఠశాల గుర్తింపును రద్దు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎంఈఓ ను సైతం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ సభ్యులు నరేష్, రాజు, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్