వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలు చేస్తున్న ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ గురువారం సమీక్షించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాతా శిశు సంక్షేమం, టీకాల నిర్వహణ, కుటుంబ నియంత్రణ, తదితర అంశాలపై పి. హెచ్. సి వైద్యాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్ఓ సాధన, పి. హెచ్. సి వైద్యాధికారులు, సూపర్వైజర్లు తదితరులున్నారు.