తలమడుగు: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

50చూసినవారు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా ఖాన్ సూచించారు. తలమడుగు మండలం బరంపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం సూర్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహనా కల్పించారు. బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై అంజమ్మ తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్