వడూర్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం

71చూసినవారు
వడూర్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం
నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలో నిర్వహించిన వడూర్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూ. పి. ఎల్) క్రికెట్ పోటీలను బుదవారం ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ హాజరై ప్రారంభించారు. ఇలాంటి క్రీడల వల్ల యువకుల్లో ఉన్న పోటీతత్వం బయటపడుతుందని పేర్కొన్నారు. క్రికెట్ పోటీలలో వందల మంది క్రీడాకారులు పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను చాటి రాష్ట్రస్థాయి పోటీలలో ఆడాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :